ఆస్తుల ప్రకటన రోటీన్ డ్రామా : విజయసాయిరెడ్డి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌పై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా మండిపడ్డారు.
వారు ఆస్తులు ప్రకటించడం కొత్తేమికాదని..ఇది రోటీన్ డ్రామా అని విమర్శించారు. ప్రకటనలో బినామీ ఆస్తులు, సీక్రెట్ ఆకౌంట్ల గురించి బాబు, లోకేష్ ప్రస్తావించలేదని మండిపడ్డారు.
వీటిపై విచారణ జరిగితే అన్నీ వెలుగు చూస్తాయని చెప్పారు. వాస్తవానికి ఈ తండ్రీకొడుకులే ఏపీతో పాటు దేశ పరిస్థితికి అతిపెద్ద జవాబుదారీలని పేర్కొన్నారు.