ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జూన్ 2017 (19:27 IST)

శిరీష ఆత్మహత్య కేసు: రాజీవ్, శ్రవణ్ కస్టడీకి కోర్టు అనుమతి.. 26, 27 తేదీల్లో?

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ పుట్టుకొస్తుంది. రాజీవ్‌ శిరీషకు పని పెంచుతూ స్టూడియోకే పరిమితం అయ్యేలా చేశాడని.. అనంతరం ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించాడని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంల

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ పుట్టుకొస్తుంది. రాజీవ్‌ శిరీషకు పని పెంచుతూ స్టూడియోకే పరిమితం అయ్యేలా చేశాడని.. అనంతరం ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించాడని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో శిరీష మృతి కేసులో అనుమానాల నివృత్తి కోసం బంజారాహిల్స్ పోలీసులు నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసు నిందితులు శ్రవణ్, రాజీవ్‌లను రెండ్రోజుల కస్టడీకి అప్పగించింది. ఇద్దరిని ఈ నెల 26, 27 తేదీల్లో కస్టడీకి అనుమతి తెలిపింది. తద్వారా ఈ నెల 26, 27 తేదీల్లో వీరిని కస్టడీలోకి తీసుకుని బంజారాహిల్స్‌ పోలీసులు విచారించనున్నారు. కాగా ఈ నెల 13వ తేదీన మంగళవారం ఫిల్మ్‌నగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీలో శిరీష ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. శిరీష కేసు విచారణపై తాజాగా ఆమె బాబాయి శ్రీనివాసరావు పలు ఆరోపణలు చేశారు. బెంగుళూరులో నివాసముండే ఆయన.. తమ బిడ్డది ముమ్మాటికీ హత్యే అంటున్నారు. శిరీషను వేశ్యగా చిత్రీకరించేందుకు మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్‌తో శిరీషకు గనుక అక్రమ సంబంధం ఉండుంటే.. కుకునూర్ పల్లి ఎస్ఐకి కూడా సహకరించి ఉండేదన్నారు. కానీ తమ బిడ్డ అలాంటిది కాదన్నారు.