శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 మార్చి 2022 (16:56 IST)

వియ్యంకులు కాబోతున్న తెదేపా నేతలు

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు బొండా ఉమామహేశ్వర రావు, ఏసీ సుబ్బారెడ్డిలు వియ్యంకులు కాబోతున్నారు. ఉమామహేశ్వర రావు కుమారుడు సిద్ధార్థ్‌కు సుబ్బారెడ్డి కుమార్తె జస్విత రెడ్డిని ఇచ్చి వివాహం చేయనున్నారు. 
 
వీరిద్దరూ అమెరికాలో కలిసి చదవుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ టీడీపీ కార్యకలాపాల్లో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. 
 
దీంతో సిద్ధార్థ్, జస్వితా రెడ్డిలు ఓ ఇంటివారు కాబోతున్నారు. అయితే, ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సివుంది. ఇద్దరు టీడీపీ నేతలు వియ్యంకులు కాబోతున్నారన్న విషయం ఇపుడు పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది.