చంద్రబాబు కాపుల గొంతు కోశారు... సన్నిహితుల వద్ద బోండా ఉమ
మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కక పోవడంతో విజయవాడ పట్టణానికి చెందిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కల్పించనందుకు అలిగారు. పార్ట
మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కక పోవడంతో విజయవాడ పట్టణానికి చెందిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కల్పించనందుకు అలిగారు. పార్టీ కోసం పనిచేస్తున్నా మంత్రి పదవి ఇవ్వరా? అని ఆక్రోశం వ్యక్తం చేశారు.
బోండా ఉమాను బుజ్జగించేందుకు ఎంపీ కేశినేని నాని, కొనకళ్ల నారాయణ రంగంలోకి దిగారు. అయినా శాంతించని బోండా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. చంద్రబాబు కాపుల గొంతు కోశారని ఆయన సన్నిహితుల వద్ద వాపోయారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. చంద్రబాబు కేశినేనికి ఫోన్ చేసి బోండా ఉమను తన వద్దకు తీసుకురావాలని ఆదేశించారు.
మరోవైపు... విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి టీడీపీ వైఖరిపై అలకబూనారు. ఆయన గన్‌మెన్‌లను వదిలిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక సీనియర్ ఎమ్మెల్యే గౌతు శివాజీకి మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన కూతురు శిరీష.. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు.