గురువారం, 17 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (13:41 IST)

జగన్ ఆదేశిస్తే గంటలోనే బాబును, లోకేష్‌లను లేపేస్తా.. బోరుగడ్డ భార్య ఏమంటోంది?

Borugadda Anil
Borugadda Anil
బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్టయ్యాడు. నల్లపాడు పోలీసుల అదుపులో వున్నాడు. వైకాపా హయంలో వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయిన అనిల్.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పలు విద్యా సంస్థల అధినేత కర్లపూడి బాబూ ప్రకాశ్‌ను డబ్బులు డిమాండ్ చేసి.. ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అనిల్‌ను అరెస్ట్ చేశారు. 
 
బోరుగడ్డ అనిల్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైకాపా చీఫ్ జగన్ ఆదేశిస్తే గంటలోనే చంపేస్తానని బహిరంగంగా ప్రకటించి వివాదాలకు కేంద్రబిందువుగా మారాడు. 
 
ఇక పవన్ కల్యాణ్‌పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కానీ ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత బోరుగడ్డ అనిల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోగా.. ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
అయితే తన భ‌ర్త నిర్దోషి అని, త‌న‌ను వ‌దిలిపెట్టాల‌ని మాజీ రిపబ్లికన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్ కుమార్ భార్య మౌనిక డిమాండ్ చేశారు. ఇంట్లో ఉన్న తన భర్తను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని భార్య మౌనిక‌ ఆరోపించారు. 
 
త‌న భర్తకు ఎలాంటి నోటీస్ లేకుండా ఇంట్లోకి చొరబడి తాళాలు పగులగొట్టి తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు. త‌న భర్త ను త‌నకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అని మౌనిక‌ వీడియో విడుదల చేశారు.