సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (13:07 IST)

ఏపీలో టీఆర్ఎస్ పాతుకుపోతుందా? వైజాగ్‌లో ఆఫీస్ రెడీ

kcrcm
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితిగా (బీఆర్ఎస్) తన ప్రభావాన్ని పెంచే ప్రయత్నంలో రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని నిర్మించేందుకు విజయవాడలో అనువైన ప్రాంతం కోసం కసరత్తు చేస్తోంది. 
 
ఇందుకోసం జక్కంపూడి ఇన్నర్ రింగ్‌రోడ్డు మండలం చుట్టుపక్కల మూడు స్థలాలను ఇప్పటికే విజయవాడలోని టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల బృందం బీఆర్‌ఎస్‌ కార్యాలయానికి ఎంపిక చేసింది.
 
ఒక రెండు వారాల్లో హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ కేంద్ర నాయకత్వం రాష్ట్ర కార్యాలయానికి సంబంధించిన స్థానాల్లో ఒకదానిని నిర్ణయించే అవకాశం ఉంది. ఎంపిక చేసిన భూములను పరిశీలించేందుకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిసెంబర్ 18, 19 తేదీల్లో విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం.
 
ఈ సందర్భంగా విజయవాడకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు కొణిజేటి ఆదినారాయణ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ఆంధ్రా రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు జక్కంపూడి కాలనీ, చుట్టుపక్కల స్థలాలను ఎంపిక చేశామన్నారు.