శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2017 (09:12 IST)

మొదటి భార్యకు తెలియకుండానే రెండో వివాహం.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక మోసం చేస్తావా?

హైదరాబాదులో రెండో పెళ్లికి సిద్ధమైన బిజినెస్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొదటిభార్యకు తెలియకుండా రెండో వివాహం చేసుకోవాలని భావించిన అతని కోసం వెతుకుతున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదులోని సంతోష

హైదరాబాదులో రెండో పెళ్లికి సిద్ధమైన బిజినెస్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొదటిభార్యకు తెలియకుండా రెండో వివాహం చేసుకోవాలని భావించిన అతని కోసం వెతుకుతున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదులోని సంతోష నగర్‌కు చెందిన బిజినెస్‌మేన్ అన్వర్ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. రెండో పెళ్లికి తొలి భార్యకు తెలియకుండా చేసుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాడు. 
 
అన్వర్‌కు ఇద్దరు పిల్లలు వున్నారు. అయితే సంతోష్ నగర్‌లోని షాన్ బాగ్ ప్యాలెస్‌లో తన రెండో వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నిఖా జరిగే సమయానికి తొలి భార్య అక్కడి వచ్చేసింది.  
 
ప్రేమించి పెళ్లి చేసుకుని... ఇద్దరు పిల్లల్ని కన్నాక ఎందుకు మోసం చేస్తున్నావని ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన అన్వర్ పారిపోయాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని తొలిభార్య ఫిర్యాదు చేయడంతో అతని  కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.