శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 26 మే 2018 (18:13 IST)

ఎమ్మెల్యేగా కాదు... ఎంపీగా పోటీ చేయబోతున్నా: బుట్టా రేణుక

2019 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదని.. మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టు వస్తున్న వార్తలను బుట

2019 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదని.. మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టు వస్తున్న వార్తలను బుట్టా రేణుక కొట్టిపారేశారు.
 
ఎమ్మిగనూరులో రూ.9.78లక్షలతో నిర్మించిన నీటి ట్యాంక్‌ను బుట్టా రేణుక ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో మళ్లీ కర్నూలు ఎంపీగానే పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. 
 
ఈసారి మాత్రం టీడీపీ తరుపున కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడించారు. అలాగే ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం నుంచి తాను పోటీ చేయట్లేదన్నారు. 2014 ఎన్నికల్లో బుట్టా రేణుక వైసీపీ నుంచి కర్నూలు ఎంపీగా గెలిచారు. అనంతరం ఆమె టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.