శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 18 నవంబరు 2016 (17:04 IST)

ఓటు కొనడం అవినీతి కాదు... చంద్రబాబు త‌ర‌పు న్యాయవాది వాద‌న‌

హైద‌రాబాద్ : ఓటుకు నోటు కేసు హైకోర్టులో ముమ్మరంగా వాదోప‌వాదాలు కొన‌సాగుతున్నాయి. తెలంగాణా తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త‌మ పార్టీలోకి ఆక‌ర్ష్‌లో భాగంగా ఓటుకు నోటు ఇచ్చిన కేసులో ఏపీ సీఎం చంద్ర‌బాబుపై విచార‌ణ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

ఈ కేసును చంద్ర‌బాబు త‌ర‌పున న్యాయ‌వాది సిద్దార్థ లూత్ర వాదిస్తున్నారు. ఓటు కొన‌డం అనేది అవినీతి కాద‌ని, ఇది ఏసీబీ ప‌రిధిలోకి రాద‌ని న్యాయ‌వాది సిద్దార్థ లూత్ర వాదించారు. కాబ‌ట్టి కేసును కోట్టేయాల‌ని పేర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్, ఏపీ సీఎం చంద్ర‌బాబుపై అభియోగాలు ఏసీబీ కోర్టు ప‌రిధిలోకి రావ‌ని న్యాయ‌వాది వాదిస్తున్నారు.