సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి
నితీష్ తివారీ బాలీవుడ్‌లో రూపొందిస్తున్న రామాయణం చిత్రంలో సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తున్నారు. ఇటీవల, కెజిఎఫ్ స్టార్ యష్ తాను రావణ్ చిత్రంలో నటిస్తున్నట్లు వెల్లడించాడు. సాయి పల్లవిని ప్రాజెక్ట్ కోసం తీసుకోవడంలో తన సహకారం వుందని తెలిపాడు. సాయిపల్లవి అద్భుతమైన నటి అని చెప్పాడు.
మరోవైపు అమరన్‌ను ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో, సాయి పల్లవి రామాయణంలో సీత పాత్ర గురించి కొన్ని వివరాలను తెలియజేసింది. ప్రస్తుతానికి తానేమీ చెప్పలేనని, సీతమ్మ పాత్రలో నటించాలంటే ముందుగా సీతమ్మ కావాలనే భయాన్ని మూటగట్టుకోవాలి.
సీతమ్మగా మారేందుకు సిద్ధం కావాలి. సీతమ్మను ఓ భక్తురాలిగా వేడుకుంటున్నాను. మీరు నన్ను ఆవహించి.. నా ద్వారా నటించండని.. అంటూ సాయిపల్లవి వెల్లడించింది.
'నిజానికి, నాకు నటి సాయి పల్లవి కావాలనుకోలేదు, కానీ సీతమ్మకు భక్తురాలు కావాలనుకుంటున్నాను, దాని ద్వారా నాకు సీతమ్మగా నటించే అవకాశం వచ్చింది. నేను సినిమా ద్వారా నాకు ఏది దొరికితే అది నేర్చుకుంటాను. నేను నేర్చుకున్న దాని గురించి తర్వాత చర్చిస్తాం' అని సాయి పల్లవి తెలిపింది. సాయి పల్లవి చెప్పిన ఈ మాటలు రామాయణం సినిమాలో సీతమ్మ పాత్రకు ఆమె ఎంత అంకితభావంతో నటించిందో తెలియజేస్తుంది.