శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 10 నవంబరు 2021 (18:16 IST)

ఓవ‌ర్ స్పీడ్ గా...ఏకంగా బ‌ట్ట‌ల షాపులోకి దూసుకొచ్చిన బైక్!

మీరు బ‌ట్ట‌లు కొంటుంటే, చీర‌లు సెల‌క్ట్ చేసుకుంటుంటే... ఏకంగా షాపులోకి ఒక బైక్ దూసుకురావ‌డం ఎపుడైనా ఊహించారా? ఆ సీన్ చూడండి ఇపుడు. తెలంగాణా జిల్లా ఖ‌మ్మంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. 
 
వస్త్ర దుకాణంలోకి ఓ బైక్ హ‌టాత్తుగా దూసుకెళ్లింది. ఖమ్మం నగరం కమాన్ బజార్ లో ఈ ఘటన జ‌రిగింది. రావి చెట్టు వద్ద గల వస్త్ర దుకాణంలోకి ఏకంగా దూసుకెళ్లింది బైక్. బ్రేక్ ఫెయిల్ అవ్వటంతో బైక్ అదుపు తప్పినట్లు సమాచారం. ఈ సంఘ‌ట‌న స‌డ‌న్ గా జ‌ర‌గ‌డంతో షాపులో క‌స్ట‌మ‌ర్లు నిర్ఘాంత‌పోయారు.

మ‌హిళ స‌మ‌య‌స్ఫూర్తిగా స్టూల్ నుంచి ప‌క్క‌కు జ‌ర‌గ‌డంతో ప్రాణ‌హాని త‌ప్పింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో దుకాణదారులు, కొనుగోలుదారులు ఊపిరిపీల్చుకున్నారు.