శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 11 జులై 2017 (08:14 IST)

అసెంబ్లీ సీట్ల పెంపు పక్కా.. ఏపీకి 225 సీట్లు గ్యారంటీ: చంద్రబాబు స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో సాధ్యంకాదనుకుంటున్న తరుణంలో కేంద్రం నుంచి మంచి వార్త రాబోతోందా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న దానిని బట్టి అతి త్వరలో ఏపీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖాయంగా జరుగుతుందని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో సాధ్యంకాదనుకుంటున్న తరుణంలో కేంద్రం నుంచి మంచి వార్త రాబోతోందా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న దానిని బట్టి అతి త్వరలో ఏపీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖాయంగా జరుగుతుందని తెలుస్తోంది. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ఖాయంగా జరుగుతుందని, దానికి అందరూ సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే వారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. 
 
తనకున్న సమాచారం ప్రకారం పునర్విభజన పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించుకుందని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశముందని చెప్పారు. దీంతో రాష్ట్రశాసనసభ స్థానాలు 225కి పెరుగుతాయని తెలిపారు. గతంలో అనుకున్నట్లుగా దీని కోసం రాజ్యాంగ సవరణ అవసరం లేదని, పార్లమెంటు అనుమతితో ఒక ఉత్తర్వు తీసుకొస్తే సరిపోతుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. 
 
జిల్లాను కాకుండా లోక్‌సభ నియోజకవర్గం యూనిట్‌గా పునర్విభజన చేయాలని కేంద్రం అనుకుంటోందని, ఈ లెక్కన ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి 9 అసెంబ్లీ సీట్లు వస్తాయని వివరించారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేస్తే మంచిదని, దీనివల్ల కొన్ని అయోమయాలు తొలగిపోతాయని కొందరు ఎంపీలు అన్నారు.