గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 30 జూన్ 2024 (18:32 IST)

ప్రధాని మోడీగారూ.. మరోమారు ఓ కప్ అరకు కాఫీ తాగాలని ఉంది.. సీఎం చంద్రబాబు రిప్లై

araku chai modi babu
గత 2016లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి అరకు కాఫీని ప్రధాని నరేంద్ర మోడీ సేవించారు. ఈ ఫోటోలను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం షేర్ చేశారు. ఈ పాత జ్ఞాపకాలను గుర్తు చేసిన ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు మరోమారు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విషయంపై ఆదివారం సీఎం బాబు ఓ ట్వీట్ చేశారు.
araku chai modi babu
 
"మా గిరిజన సోదర సోదరీమణులు ప్రేమతో, అత్యంత శ్రద్ధాసక్తులతో అరకు కాఫీని తయారు చేస్తారు. అరకు కాఫీ సుస్థిరత, గిరిజన సాధిరాకత, ఆవిష్కరణకు ప్రతీకగా నిలుస్తుంది. ఏపీ ప్రజలు హద్దుల్లేని శక్తిసామర్థ్యాలకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. 2016లో మనం అకరు కాఫీ తాగుతున్న ఫోటోలను షేర్ చేసినందుకు, అచ్చంగా ఏపీలోనే ఉత్పత్తి అవుతున్న అరకు కాఫీకి ప్రచారం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు ప్రధానమంత్రి మోడీగారు. మీతో మరో కప్ అరకు కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నాను అంటూ చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.