ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (07:28 IST)

12 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

మాజీ ముఖ్యమంత్రి,కుప్పం శాసనసభ్యుడు చంద్రబాబు  ఈ నెల 12,13,14 తేదీల్లో  కుప్పం నియోజకర్గంలో పర్యటిస్తున్నారు.

12న విజయవాడ నుంచి బెంగళూరుకు విమానంలో చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన కోలారు, కేజీఎఫ్‌, బంగారుపేట మీదుగా రాళ్లబూదుగూరుకు వస్తారు.

కుప్పం ఆర్టీసీ బస్టాండులో మధ్యాహ్నం 1.30 గంటలకు బహిరంగ సభ ఉంటుంది. 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటిస్తారు.

14న గుడుపల్లె సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు సభ ముగించుకుని బెంగళూరు మీదుగా విజయవాడకు ప్రయాణమవుతారు.