గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జూన్ 2024 (13:07 IST)

ఏపీలో పండగ వాతావరణం... దైవసాక్షిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం video

Chandrababu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరంలోని మేడ ఐటీ పార్కులో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరంలోని కేసరపల్లి గ్రామంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్రమంత్రులతో సహా వందలాది మంది వీఐపీలు హాజరవుతున్నారు. విజయవాడ, గన్నవరం జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు వేలాదిగా తరలివస్తున్నారు.
 
 
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్... చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే... అంటూ బాబు ప్రమాణం కొనసాగింది. రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూర్చుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రమాణం ఆచరించారు.
 
అనంతరం, చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.