శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (10:18 IST)

శిఖా చౌదరి అంటే ఆమె అంకుల్‌కి ప్రాణం... ఆయన ఆస్తులన్నీ శిఖా... కబాలి నిర్మాత

55 ఏళ్ల మేనమామతో ఎఫైర్ సాగిస్తూ ఆయన ఆస్తులన్నిటినీ చూస్తూ మరో యువకుడితో ప్రేమాయణం సాగిస్తూ ప్రస్తుతం పోలీసుల విచారణలో వున్న శిఖా చౌదరి గురించి కబాలి నిర్మాత కేపీ చౌదరి కొన్ని విషయాలు చెప్పారు. శిఖా చౌదరి అంటే ఆమె మామయ్యకు అమితమైన ప్రేమ అనీ, అలాంటిది ఆయన్ను హత్య చేయించాల్సిన అవసరం ఆమెకు లేదన్నారు. అంతేకాదు... జయరాం ఆస్తులన్నీ శిఖానే చూసుకుంటూ వుండేవారని చెప్పుకొచ్చారు.
 
ఇదిలావుంటే శిఖా చౌదరిని తప్పించేందుకు రాజకీయ ఒత్తిళ్లతోపాటు నిర్మాత కూడా రంగంలోకి దిగారంటూ ప్రచారం జరుగుతోంది. శుక్రవారం రాత్రి శిఖా చౌదరితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద విచారణ జరుపుతున్నారు. ఐతే స్టేషనుకి వచ్చిన నిర్మాత చౌదరి ఆమె కారుని తీసుకెళ్లడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.