సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (14:09 IST)

చిత్తూరులో దారుణం... టెంపో - కంటైనర్ ఢీ.. ఆరుగురి దుర్మరణం

చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. టెంపో, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలోని పుంగనూరు - మదనపల్లె మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణా

చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. టెంపో, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలోని పుంగనూరు - మదనపల్లె మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో నలుగురు స్పెయిన్ దేశస్థులు ఉన్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... అనంతపురంలోని బత్తలపల్లి ఆర్డీటీ సంస్థకు వచ్చిన 13 మంది స్పెయిన్ దేశస్థులు శనివారం ఉదయం టెంపో ట్రావెలర్‌ వాహనంలో పాండిచ్చేరికి బయలుదేరారు. మార్గమధ్యలో పుంగనూరు-మదనపల్లె వద్ద వీరి వాహనాన్ని కంటైనర్ లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతిచెందారు. 
 
ప్రమాదవార్త తెలుసుకున్న మదనపల్లె సబ్ కలెక్టర్ వెట్రిసెల్వి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన 9 మందిని ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతి చెందిన వారిలో స్పెయిన్ దేశానికి చెందిన నలుగురు విన్సెంట్ పెరెజ్, ఫ్రాన్సిస్ ఫెడ్రోజ్, జోసెఫ్ మొరాన్, నీవెస్ లోపెజ్‌గా గుర్తించారు.