ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 26 ఆగస్టు 2021 (10:30 IST)

డ్రగ్స్ కేసులో ఇక వ‌రుస‌గా సినీ స్టార్స్ ఇడి విచార‌ణ‌కు పిలుపు

హైద‌రాబాదులో సంచ‌ల‌నం క‌లిగించిన డ్ర‌గ్స్ కేసులో ఈడీ దర్యాప్తు తిరిగి ముమ్మరం అవుతోంది.  నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఈ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వ‌చ్చింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ఎన్‏ఫోర్స్‏మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. 
 
ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ స్టార్స్ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జగన్నాధ్ ను ఆగస్టు 31న ఈడీ ఎదుట హాజ‌రు కావాల‌ని పిలిచారు. హీరోయిన్, నిర్మాత ఛార్మి కౌర్ ను సెప్టెంబర్ 2 పిలిచారు. ఇక లీడింగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని సెప్టెంబర్ 6, రాణా దగ్గుబాటిని సెప్టెంబర్ 8 హాజ‌రుకావాల‌ని పిలిచారు. 
 
హీరోలు రవితేజ, శ్రీనివాస్ ల‌ను సెప్టెంబర్ 9, నవదీప్,  ఎఫ్ ఎం క్ల‌బ్ జి.ఎం ల‌ను సెప్టెంబర్ 13న విచార‌ణ‌కు పిలిచారు. న‌ర్త‌కి ముమైత్ ఖాన్ ని సెప్టెంబర్ 15న‌, హీరో తనీష్ ను సెప్టెంబర్ 17 పిలిచారు. ఇక నందుని  సెప్టెంబర్ 20, తరుణ్ ని సెప్టెంబర్ 22 న హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.