సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 23 జూన్ 2017 (03:12 IST)

నేనంటే మీకు ఇష్టం లేకపోతే మీ పనులు నేనెందుకు చేయాలి.. నిలదీసిన చంద్రబాబు

ప్రజలకు పింఛన్లు, రేషన్లు క్రమం తప్పకుండా ఇస్తున్నాను. వారికోసం చక్కటి రోడ్లు వేస్తున్నాను. నేనిచ్చేవన్నీ తీసుకుంటున్నారు. రోడ్లపైచక్కగా తిరుగుతున్నారు. కానీ ఎవరో డబ్బు ఇస్తే తీసుకుని వారికి ఓటేస్తారా అంటూ వాపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తాను కూడా ఇత

ప్రజలకు పింఛన్లు, రేషన్లు క్రమం తప్పకుండా ఇస్తున్నాను. వారికోసం చక్కటి రోడ్లు వేస్తున్నాను. నేనిచ్చేవన్నీ తీసుకుంటున్నారు. రోడ్లపైచక్కగా తిరుగుతున్నారు. కానీ ఎవరో డబ్బు ఇస్తే తీసుకుని వారికి ఓటేస్తారా అంటూ వాపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తాను కూడా ఇతరుల్లాగా వెయ్యేం ఖర్మ అయిదు వేల రూపాయలు ఇవ్వగలను కాని దానికోసం అవినీతికి పాల్పడాల్సి వస్తుంది. అలాంటి దరిద్రపు గొట్టు రాజకీయాలు తాను చేయలేనని బాబు తేల్చి చెప్పారు. 
 
కర్నూలు జిల్లా నంద్యాలలో ఇఫ్తార్‌ విందులో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు  గురువారం తనను కలిసిన ప్రజలు, పలు సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ తాను రూ.వెయ్యి పింఛన్‌ ఇస్తున్నానని, రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. అయినా కొందరు నేతలు ఓటుకు ఇచ్చే రూ.500 ఎందుకు తీసుకుంటున్నారని, దీనివల్ల ఏమొస్తుందని ప్రశ్నించారు. తానూ ఓటుకు రూ.వెయ్యి నుండి రూ.5వేలు ఇవ్వగలనని, ఇందుకోసం అవినీతికి పాల్పడాల్సి వస్తుందన్నారు.  
 
నంద్యాల ‘‘నేను ఇచ్చే పెన్షన్, రేషన్‌ తీసుకుంటున్నారు, మేం వేసిన రోడ్లపైన తిరుగుతున్నారు. కానీ నాకు ఓటు వేయకపోతే ఎలా లేకపోతే పెన్షన్లు, రేషన్‌ తీసుకోవద్దు. ఓటెయ్యని గ్రామాలను పక్కన పెట్టాల్సి వస్తుంది.’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.