గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 23 సెప్టెంబరు 2021 (09:59 IST)

‘అమెరికన్‌ కార్నర్‌’ను ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేడు విశాఖ అమెరిక‌న్ కార్న‌ర్ ను ప్రారంభించ‌నున్నారు.  అక్క‌డ అమెరిక‌న్ కార్న‌ర్ ను ఆయ‌న లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టికే విశాఖ అమెరిక‌న్ కార్న‌ర్ వేదిక పరిసరాలను అధికారులు, సిబ్బంది పరిశీలించారు. 
 
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)లో ఏర్పాటు చేసిన అమెరికన్‌ కార్నర్‌ గురువారం నుంచి తన సేవలు ప్రారంభించనుంది. సీఎం వైఎస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్, యూఎస్‌ ఎయిడ్‌ ఇండియా డైరెక్టర్‌ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పాల్గొంటారు. ఈ ఏర్పాట్లను అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులతో కలిసి  వీసీ పర్యవేక్షించారు.