బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:13 IST)

ఆ కుటుంబంలో ఏ ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం జరిగినా సీఎందే బాధ్యత

ఆత్మహత్యాయత్నం చేసిన అక్బర్ బాషా కుటుంబంలోని ఏ ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం జరిగినా, సీఎం జగన్ బాధ్యత వహించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. బాషా భూమి తిరిగిచ్చేశామని, వివాదం సమసిపోయిందని జగన్ బృందం నమ్మించి మోసం చేశారని, దానిని తట్టుకోలేకనే అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నంకు  పాల్పడిందన్నారు.
 
పోలీసులు పులివెందుల ఫ్యాక్షన్ ముఠా సభ్యుల్లా వ్యవహరిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ కోసం ఇంకెంతమంది మైనార్టీలను బలిగొంటారని నిలదీశారు. 
 
ఆత్మహత్యాయత్నం చేసిన అక్బర్ బాషా కుటుంబంలోని ఏ ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం జరిగినా, సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి అక్బర్ బాషా భూమిని కబ్జా చేస్తే, ఎన్​కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించటం దారుణమని మండిపడ్డారు. బాషా భూమి తిరిగిచ్చేశామని, వివాదం సమసిపోయిందని జగన్ బృందం నమ్మించి మోసం చేశారన్నారు. బాషా కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.