ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2023 (10:57 IST)

విశాఖపట్టణంకు వస్తున్నా : సీఎం జగన్.. డిసెంబరులో ముహూర్తం!

jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మాకాంను తాడేపల్లి నుంచి విశాఖకు మార్చనున్నారు. ఆయన కోసం రిషికొండను బోడిగుండు కొట్టించి... అక్కడ రూ.500 కోట్ల ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో మరో ప్యాలెస్‌ను నిర్మిస్తున్నారు. సోమవారం విశాఖపట్టణంలో జరిగిన ఇన్ఫోసిస్ కార్యలయాన్ని ప్రారంభించారు. 
 
ఇందులో ఆయన మాట్లాడుతూ, 'విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోంది. టైర్ వన్ సిటీగా ఎదగడానికి కావాల్సిన అర్హతలు, సామర్థ్యం ఈ నగరానికి ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నేను కూడా విశాఖకు మకాం మార్చబోతున్నాను. మంచి చోటు వెతకమని ఇప్పటికే మా అధికారులకు చెప్పాను. ముఖ్యమంత్రి రావాలంటే పెద్ద సెటప్ అవసరం. భద్రతాపరమైన ఏర్పాట్లతోపాటు, సీఎంవో, ఇతర అధికారులు ఉండటానికి కూడా ఆ స్థాయి ఏర్పాట్లు కావాలి. అన్నీ అనుకూలిస్తే ఈ నెలలో లేదా డిసెంబరు నాటికి ఇక్కడికి వస్తాను. విశాఖలో ఉండి, ఇక్కడి నుంచే పాలన సాగిస్తాను. టైర్-1 నగరంగా విశాఖ ఎదగడానికి ఈ రకమైన తోడ్పాటు అవసరం' అంటూ సీఎం జగన్ అన్నారు.