శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (08:29 IST)

భారతదేశాన్ని విభజించేందుకు కొన్ని శక్తుల కుట్ర: విశ్వహిందూ పరిషత్

హిందూ సమాజాన్ని చీల్చి భారతదేశాన్ని విభజించేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు కార్యకర్తలు ముందుండాలని విశ్వహిందూ పరిషత్ అఖిల భారత సంఘటన మంత్రి వినాయకరావు దేశ్ పాండే సూచించారు.

సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు, కులాల మధ్య అంతరాన్ని చెరిపేసేందుకు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పని చేయాలని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో మతమార్పిడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం, సామాజిక వర్గం, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని విదేశీ శక్తులు.. పరాయి మతస్తులు హిందువులను మతం మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీలకు మాయమాటలు చెప్పి భారతదేశం పైనే బురదజల్లే విధంగా దుష్టశక్తులు విషయం నింపుతున్నాయి అని  పేర్కొన్నారు. అందులో భాగంగానే ఇటీవల కాలంలో దసరా రోజున రావణ దహనం కి బదులు రాముడి దహనం చేస్తున్నారని చెప్పారు. దుర్గామాత ను ద్వేషిస్తూ మహిషాసుర రాక్షసులను పూజిస్తున్నారు అని వివరించారు.

పెరిగిపోతున్న విదేశీ శక్తుల ఆగడాలను అడ్డుకునేందుకు కార్యకర్తలు శక్తికి మించి పని చేయాలని ఆయన సూచించారు. దేశం కోసం.. ధర్మం కోసం పని చేసే వారి సంఖ్య మరింత పెరగాలని చెప్పారు. స్వ శక్తులైన  కార్యకర్తలను గుర్తించి సంఘ కార్యంలో భాగస్వాములను చేయాలన్నారు.
 
అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం పూర్తయ్యేవరకు కార్యకర్తలు అకుంఠిత దీక్షతో పని చేయాలని పేర్కొన్నారు. సమాజంతో సంబంధాలు మరింత పెంచుకుని దేశ సేవ చేయాలని అన్నారు.