భారత్‌లో కరోనా వ్యాప్తికి ఆ రెండు దేశాల ప్రయాణీకులే కారణమట!
భారత్‌లో విస్తృతంగా కోవిడ్-19 వ్యాపించేందుకు దుబాయ్, బ్రిటన్ నుండి వచ్చిన ప్రయాణీకులే కారణమని మండిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి) చేసిన అధ్యయనంలో తెలిపింది. జర్నల్ ఆఫ్ ట్రావెల్ మెడిసిన్‌లో ప్రచురించిన దాని ప్రకారం..భారత్‌లోకి కరోనా ప్రవేశించేందుకు అంతర్జాతీయ ప్రయాణాలే కారణమని అధ్యయనం పేర్కొంది.
తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా బారిన పడినవారు... ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ వారికి వ్యాధిని వ్యాప్తి చేయడంలో తక్కువ పాత్ర పోషించారని తేలింది. గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్ర, కేరళ, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక రాష్ట్రాలు స్థానికంగా కరోనా వ్యాప్తికి ముఖ్యమైన పాత్ర పోషించాయని తెలిపింది.
వారిలో కొందరు అంతర్రాష్ట్రల్లో వైరస్ వ్యాప్తికి కారణమయ్యారని తేలింది. కరోనా వ్యాప్తిని..దాని విస్తరణను ప్రపంచం నుండి జాతీయ స్థాయికి వ్యాపించడాన్ని గుర్తించామని, భారత్‌లో వ్యాధి విస్తృతంగా వ్యాప్తిలో ప్రధాన పాత్ర పోషించిన కొద్ది మంది సూపర్ స్ప్రెడ్డర్లను గుర్తించామని ఐఐటి మండీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సరితా ఆజాద్ తెలిపారు. తొలి దశలో ఇక్కడ కరోనా వ్యాప్తికి స్థానికులే కారణమని.. వారి ప్రయాణ చరిత్ర ఆధారంగా తేలిందని చెప్పారు.
పరిశోధనా బఅందం జనవరి నుండి ఏప్రిల్ వరకు కరోనా బారిన పడ్డ వారి ప్రయాణ చరిత్రను ప్రాధమిక డేటా వనరుగా ఉపయోగించుకుందని, కరోనా ప్రారంభ దశలో వైరస్ వ్యాప్తి ఓ సోషల్ నెట్ వర్క్‌లా తయారయిందని చెప్పారు.