శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జూన్ 2020 (15:13 IST)

ఏపీని వణికిస్తోన్న కరోనా.. ఒకే రోజు 210 కేసులు.. కోయంబేడుకు లింకు

ఆంధ్రప్రదేశ్‌ని కరోనా వైరస్ వణికిస్తోంది. శనివారం ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. శనివారం ఒక్కరోజే కొత్తగా 210 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఏపీలో నమోదైన కేసుల సంఖ్య 4460 కి పెరిగింది. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి.
 
ఏపీలో ఇప్పటివరకు 73మంది మరణించారు. ఇప్పటివరకు 2వేల 323 మంది వివిధ జిల్లాలోనూ, వలస కూలీలు 274 మంది, ఎన్‌ఆర్ఐలు నలుగురు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 1192యాక్టివ్ కేసులు ఉండగా, విదేశాల నుంచి వచ్చిన 127మంది, వలస కూలీలు 467 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 29 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఒక్క మరణం కూడా సంభవించలేదు.