శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జూన్ 2020 (13:04 IST)

భారత్, చైనాలు అలా చేస్తే అసలు సంగతేంటో తేలిపోద్ది.. ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలపై ట్రంప్ సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఒకవేళ భారత్, చైనా దేశాలు కరోనా వైరస్ పరీక్షలు విస్తృతంగా చేపడితే, అప్పుడు ఆ దేశాల్లో అమెరికా కన్నా ఎక్కువ కేసులే నమోదు అవుతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. 
 
అమెరికాలో రెండు కోట్ల మందికి కరోనా పరీక్షలు చేపట్టినట్లు ట్రంప్ తెలిపారు. జర్మనీ, దక్షిణ కొరియా, భారత్ కంటే కన్నా.. ఎక్కువ సంఖ్యలో వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జర్మనీలో ఇప్పటివరకు కేవలం 40 లక్షల మందికి మాత్రమే కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. 
 
దక్షిణ కొరియాలో 30 లక్షల మందికి పరీక్షలు చేపట్టారు. అమెరికాలో ఇప్పటి వరకు 19లక్షల కరోనా కేసులు నమోదు అయినట్లు జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ పేర్కొంది. ఇంకా ఒక లక్షా 9 వేల మంది మరణించారు. భారత్‌లో ఇప్పటివరకు 40 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఎక్కువ స్థాయిలో టెస్టింగ్ జరిగితేనే, ఎక్కువ కేసులు బయటపడుతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.