క్యాన్సర్ కన్నా కరప్షన్ డేంజర్: గవర్నర్
కరెప్షన్ క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైందని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన విజిలెన్స్ వారోత్సవాలను గవర్నర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిరహిత దేశంగా భారతదేశం ఉండాలనేది తన ఆకాంక్ష అన్నారు. దేశంలో పని చేస్తున్న అన్ని ప్రభుత్వ సంస్థలు అవినీతిరహితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.