శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 8 ఫిబ్రవరి 2025 (09:39 IST)

తిరుమల నందకం గెస్ట్ హౌసులో దంపతులు ఆత్మహత్య

suicide
తిరుమల కొండపై వున్న నందకం అతిథి గృహంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తిరుమలలో కలకలం రేపుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన దంపతులు శ్రీనివాసులు నాయుడు, అరుణలు నందకం అతిథి గృహంలోని 203 గదిని తీసుకున్నారు. గురువారం గదిని తీసుకున్న వీరిద్దరూ ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానంతో సిబ్బంది కిటికీలు తెరిచి చూసారు.
 
గదిలో దంపతులు ఇద్దరూ చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. సిబ్బంది విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.