బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (12:24 IST)

రమణ దీక్షితులుకు ఇక కష్టాలే.. క్రిమినల్ కేసులు?.. పరువు నష్టందావా

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు మున్ముందు కష్టాలు ఎదురుకానున్నాయి. ఆయనపై క్రిమినల్ కేసులతోపాటు పరువు నష్టందావా వేయాలని తితిదే పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ వి

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు మున్ముందు కష్టాలు ఎదురుకానున్నాయి. ఆయనపై క్రిమినల్ కేసులతోపాటు పరువు నష్టందావా వేయాలని తితిదే పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.
 
తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అధ్య క్షతన పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం ఛైర్మన్‌, ఈవోలు విలేకరులతో మాట్లాడుతూ గత కొంతకాలంగా వరుస ఆరోపణలు చేస్తున్న వారిపై పరువునష్టం కేసులు, క్రిమినల్‌ కేసులు దాఖలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించమని టీటీడీ న్యాయ అధికారికి సూచించామని, రెండుమూడు రోజుల్లో ఈ కేసులపై తుది నిర్ణయం తీసుకుంటామని ఈవో తెలిపారు. వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.