శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 5 జూన్ 2018 (14:13 IST)

నేడు టిటిడి పాలకమండలి సమావేశం... రమణదీక్షితుల వ్యవహారం ఎలా డీల్ చేస్తారో ?

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఈ రోజు సమావేశం కానుంది. ఇటీవలి చోటుచేసుకున్న వివాదాస్పద అంశాలు, రమణదీక్షితులు వ్యవహారం, ఆరోపణలు తదితర అంశాలపై చర్చించనున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఈ రోజు సమావేశం కానుంది. ఇటీవలి చోటుచేసుకున్న వివాదాస్పద అంశాలు, రమణదీక్షితులు వ్యవహారం, ఆరోపణలు తదితర అంశాలపై చర్చించనున్నారు. 
 
ఆలయ పవిత్రత దెబ్బతినకుండా విమర్శలకు చెక్ పెట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై చర్చించే అవకాశం ఉంది. అయితే టీటీడీ వివాదంలో తనపై వస్తున్న ఆరోపణలపై తనపై సీబీఐ విచారణ జరిపించాలంటూ నిన్న రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు... తనపై ఆరోపణలు చేస్తున్నవారు కూడా సీబీఐ విచారణకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. దీనిపై టీటీడీ పాలక మండలి ఎలా స్పందిస్తుందో చూడాలి.