ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2016 (11:24 IST)

పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణ సర్కారు ఖజానా ఖాళీ? ఉద్యోగులకు సగం జీతమే?!!

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దుతో దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్ర సర్కారు ఖజానా ఖాళీ అయింది. దీంతో ఆ రాష్ట్ర ఉద్యోగులకు సగం వేతనం మాత్రమే ఇవ్వనున్నారు.

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దుతో దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్ర సర్కారు ఖజానా ఖాళీ అయింది. దీంతో ఆ రాష్ట్ర ఉద్యోగులకు సగం వేతనం మాత్రమే ఇవ్వనున్నారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న విషయంతెల్సిందే. 
 
ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. దీంతోపాటు.. లోటుతో సతమతమవుతున్న ప్రభుత్వ ఖజానా మరింతగా కుంచించుకుపోయింది. దీంతో ఈ నెల్లో ఉద్యోగుల వేతనాలు సైతం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో సగం జీతం ఇచ్చి, మిగిలినది తరువాత ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
ఈ మేరకు ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారులతో మంతనాలు జరిపిన సీఎం కేసీఆర్, ఉద్యోగులు, పెన్షనర్లకు నెలకు రూ.2,500 కోట్లు చెల్లిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రానికి నెలకు రూ.9 వేల కోట్ల ఆదాయం రావాల్సి వుండగా, నోట్ల రద్దుతో అందులో సగం కూడా రాని పరిస్థితి నెలకొందని అధికారులు చెప్పడంతో, ఎవరికీ ఇబ్బందులు కలగని రీతిలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కేసీఆర్ సూచించారు. 
 
జీతాల్లో 25 నుంచి 50 శాతం వరకూ తగ్గించి, ఆదాయం సమకూరిన తర్వాత బకాయిని తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేయాలని అన్నారు. కాగా, ఈ నిర్ణయం అమలైతే దాదాపు 3.5 లక్షల మందిపై ప్రభావం పడుతుందని అంచనా. ఇదేసమయంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ కూడా నిలిపివేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.