గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 4 జులై 2017 (06:36 IST)

బర్త్‌డే వేడుకలకు పిలిచి.. డిగ్రీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్...

పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ఓ విద్యార్థినిపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఖమ్మం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ఓ విద్యార్థినిపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఖమ్మం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఖమ్మం పట్టణంలోని ఓ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు ఓ గదిని అద్దెకు తీసుకుని నివశిస్తున్నారు. వీరితో ఓ విద్యార్థిని స్నేహం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో బర్త్‌డే పార్టీ ఉందని ఆ విద్యార్థిని గదికి ఆహ్వానించారు. 
 
ఆ తర్వాత నలుగురు విద్యార్థులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. సెల్‌ఫోన్‌లో నగ్నంగా చిత్రీకరించి బ్లాక్‌ మెయిలింగ్‌‌‌కు దిగారు. వారి వేధింపులను భరించలేని యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.