సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: గురువారం, 29 అక్టోబరు 2020 (13:41 IST)

జగన్ ఇమేజ్ బిల్డప్ చేయడం కోసమే జాతీయ దినపత్రికతో ఒప్పందం: దేవినేని ఉమ

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఇమేజ్‌ను భారీగా బిల్డప్ చేయడం కోసమే ఓ జాతీయ దిన పత్రికతో ఒప్పందం కుదుర్చుకున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. ఇందుకోసం సుమారు 8.15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని రాష్ట్ర సమాచార ప్రసార శాఖ నిన్న ప్రత్యేక జీవో జారీ చేయడంతో తెలిసిందని పేర్కొన్నారు.
 
జగన్ సర్కారు పేరుప్రతిష్ఠలు కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో పరువు కాపాడాలంటూ ఒక పత్రికతో ఒప్పందం చేసుకోవడమా, ప్రభుత్వం, ప్రభుత్వ నేతల ప్రతిష్ఠలు కాపాడేలా అందులో ప్రచురణ, మీ భజన కోసం 8.15 కోట్లు ప్రజాధనం వృదా చేయడమా అని ప్రశ్నిం చారు.
 
సమాచార శాఖ దగ్గర నిధులు లేకపోయినా అదనపు నిధులు మంజూరు చేయించారు. పేరు ప్రతిష్ఠలు మనం ప్రజలకు చేసే సేవలను బట్టి వస్తాయి కానీ డబ్బులిచ్చి కొనుక్కోవడం కాదని మండిపడ్డారు.