బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 19 మార్చి 2022 (14:38 IST)

తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు... అలిపిరి వద్ద గంటల తరబడి వెయిటింగ్

తిరుమలలో తిరిగి సాధారణ స్థితి కనిపిస్తోంది. కరోనా కేసులు బాగా తగ్గిపోవడంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. శనివారం నాడు అలిపిరి వద్ద భారీగా వాహనాలు చెకింగ్ పాయింట్ వద్ద బారులు తీరాయి.

 
వాహనాల రద్దీతో సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా తిరుమల శ్రీవారిని శుక్రవారం నాడు 66,763 భక్తులు దర్శించుకున్నట్లు తితిదే తెలిపింది. రూ. 4.29 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది.

 
మరోవైపు భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో తిరుమలలో అద్దె గదుల కొరత ఏర్పడింది. దీనితో భక్తులు పెద్దసంఖ్యలో గదుల కోసం వేచి చూస్తున్నారు.