గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 మార్చి 2022 (13:11 IST)

తిరుమలలో 'ఆర్ఎక్స్-100' బ్యూటీ సందడి.. సెల్ఫీల కోసం

"ఆర్ఎక్స్ 100" చిత్రం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈమె తాజాగా తిరుమల క్షేత్రంలో కనిపించి, భక్తులను సందడి చేశారు. ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. 
 
శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు ఆమె ఆదివారం తిరుమలకు వచ్చారు. లంగా ఓణీని ధరించి చాలా సంప్రదాయబద్ధంగా వచ్చిన పాయల్ రాజ్‌పుత్ శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల భక్తులతో సరదాగా గడిపారు. వారితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీవారిని దర్శించుకున్నందుకు చాలా ఆనందగా ఉందన్నారు. దైవ దర్శనం అనంతరం చాలా ప్రశాంతంగా అనిపించిందని వెల్లడించారు. తిరుమల చాలా అందంగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం తిరుమలలో ఓ సినిమా షూటింగ్ జరగాల్సివుందని తెలిపారు. జిన్నా అనే సినిమాలో నటిస్తున్నానని చెప్పారు.