సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: సోమవారం, 7 మార్చి 2022 (21:36 IST)

Gold Man తిరుమల దర్శనం... వామ్మో ఎవరీ బంగారు బాబు?

నగలంటే ఇష్టపడే వారిలో ఎక్కువగా ఆడవారే ఉంటారు. ఆడవారి అందానికి నగలు ముఖ్యం. నగల కోసం భర్తను పీడించేస్తూ ఉంటారు. మగవారు అయితే తక్కువగానే బంగారాన్ని వేసుకుంటూ ఉంటారు. చేతికి ఉంగరమో... లేకుంటే చైన్ లాంటిది. కానీ తిరుమలలో బంగారు బాబు ప్రత్యక్షమయ్యాడు. ఒళ్ళంతా బంగారంతో భక్తులను ఆశ్చర్యపరిచాడు.

 
మీరు ఫోటోలో చూస్తున్న వ్యక్తి పేరు పవన్ పాటిల్. హైదరాబాద్‌లో వ్యాపార వేత్త. పేరు గాంచిన వ్యాపార వేత్తే. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. అయితే సాంప్రదాయం ప్రకారం పంచెతో దర్సించుకోవాలి.

 
పవన్ పాటిల్ పంచె, బనియర్‌ను ధరించాడు. షర్ట్ వేసుకోకుండానే ఆలయంలోకి ప్రవేశించాడు. అయితే పవన్ మెడలో మూడు కిలోల బంగారం కనిపించింది. అలాగే పదివేళ్ళలో ఎనిమిది వేళ్ళకు బంగారు ఉంగరాలు ఉన్నాయి. పవన్ పాటిల్‌ను చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. ఆలయంలో పనిచేసే టిటిడి ఉద్యోగులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. గత మూడేళ్ళుగా బంగారాన్ని ధరించే ఉన్నానని చెబుతున్నాడు పవన్ పాటిల్. 

 
తనకు బంగారం ఎక్కడా బరువు అనిపించడం లేదని.. బంగారం తనకు అలంకారంగా ఉందంటున్నాడు. పవన్ పాటిల్‌తో ఫోటోలు దిగేందుకు కొంతమంది ప్రయత్నించారు. అయితే వారిని దూరంగా ఉంచే ఫోటోలు తీసుకున్నాడు పవన్. ఎక్కడ బంగారు చైన్లను లాక్కుని వెళ్ళిపోతారేమోనన్న భయం పవన్ పాటిల్‌లో కనిపించింది.