గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (13:23 IST)

పరుగులు పెడుతున్న పసిడి రేట్లు.. ఆల్‌టైమ్ గరిష్టానికి రూ.2500 చేరువలో..?

బంగారం ధరలపై స్టాక్ మార్కెట్ ప్రభావం పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్ల వరకు పడిపోయింది. బెంచ్‌మార్క్ సూచీలు రెండూ 2 శాతానికి పైగా క్షీణించాయి. 
 
స్టాక్ సూచీలు పతనం కావడంతో మరోవైపు బంగారం ధర పరుగులు పెడుతోంది. పసిడి రేటు ఆల్‌టైమ్ గరిష్టానికి రూ. 2500 చేరువలో ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఇంకో రెండు మూడు రోజుల్లో పసిడి రేటు మరో కొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంది. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 2 వేల డాలర్ల పైకి చేరింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో (ఎంసీఎక్స్)లో బంగారం ధర 1.8 శాతం పెరుగుదలతో 10 గ్రాములకు రూ.53,500కు చేరింది. 
 
కాగా బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 56,200గా ఉంది. 2020 ఆగస్ట్ నెలలో పసిడి రేటు ఈ స్థాయికి చేరింది. ఇప్పుడు బంగారం ధర ఈ స్థాయికి చేరువలో ఉంది.