ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (12:48 IST)

సన్నీ లియోన్‌తో మంచు విష్ణు రొమాన్స్.. పాయల్ కూడా రెడీ

మంచు విష్ణు ప్రస్తుతం సన్నీ లియోన్‌తో రొమాన్స్ చేయనున్నాడుయ విష్ణు మా రాజకీయాల్లోకి దిగడం, ప్రెసిడెంట్ కావడం, మధ్యలో కరోనా దెబ్బ వెరసి కొన్ని రోజులు విష్ణు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇక తాజాగా ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముద్నుకు రానున్నట్లు ఇటీవల ప్రకటించాడు. 
 
నూతన దర్శకుడు ఇషాన్ దర్శకత్వంలో విష్ణు ఒక సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు గా విష్ణు కనిపించనున్నాడు.  
 
ఇక ఇప్పటికే ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నదని వార్తలు గుప్పుమనడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో శృంగార తార సన్నీ లియోన్ నటించనుంది. 
 
రేణుక అనే పాత్రలో ఆమె నటిస్తున్నదని మేకర్స్ అధికారికంగా తెలిపారు. సన్నీకి మంచు ఫ్యామిలీకి మధ్య స్నేహ బంధం ఉందన్న విషయం తెలిసిందే. కరెంట్ తీగ సినిమాలో మంచు మనోజ్ కోసం ఆమె ఒక సాంగ్‌లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు విష్ణు కోసం అమ్మడు రంగంలోకి దిగుతుంది.