శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (23:04 IST)

న్యూ ఇయ‌ర్ డాన్స్ అద‌ర‌కొట్టిన స‌న్నీ లియోన్‌

Sunny Leone
ఇటీవ‌లే న్యూ ఇయ‌ర్ వేడుక‌లు జ‌రిగాయి. క‌రోన టైంలో చాలా మంది న‌టీమ‌ణులు ప‌లు ప్రైవేట్ ఈవెంట్‌ల‌లో పాల్గొన్న దాఖ‌లాలు త‌క్కువే. కానీ స‌న్నీలియోన్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఓ ప్ర‌ముఖ ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన వేడుక‌లో ఆమెదే ఎట్రాక్ష‌న్‌. కేవ‌లం ఆమెతోనే వేడుక‌లు నిర్వహించాల‌ని ఆ సంస్థ ప‌ట్టుప‌ట్టింది. దాంతో అది స‌క్సెస్ అయి ఓ సినిమా షూటింగ్ త‌ర‌హాలో సాగింది.
 
Sunny Leone dance
పాండిచ్చేరి లో డిసెంబ‌ర్ 31న జ‌రిగిన ఈ కార్య్ర‌క‌మం చాలా వినూత్నంగా సాగింది. బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ ఆధ్వ‌ర్యంలో 12 మంది డాన్స‌ర్ల‌తో ఈవెంట్ జ‌రిగింది. స‌ముద్ర‌తీరాన ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మంలో ఇసుక‌ను మీద వేసుకుని కైపుగా డాన్స్ వేయ‌డం ఒక‌భాగ‌మైతే, 10మంది డాన్స‌ర్ల‌తో ప‌బ్ డాన్స్ త‌ర‌హాలో రెచ్చిపోవ‌డం మ‌రోటి. ఇలా డాన్స్‌లో వైవిధ్యాన్ని చూపి అక్క‌డి బిగ్ షాట్స్‌ను ఆశ్చ‌ర్య ప‌రిచింద‌ని తెలిసింది. ఇందుకు భారీ మొత్తంలో ఆమెకు పారితోషికం ద‌క్కింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇటీవ‌లే త‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కండోం ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడర్ గా వుంది.