గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 10 జులై 2020 (10:12 IST)

దూరదర్శన్ ఆన్లైన్ తరగతుల షెడ్యూలు మార్పు

దూరదర్శన్‌లో నిర్వహిస్తోన్న 'ఆన్‌లైన్' తరగతుల షెడ్యూలులో మార్పులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు సమాచారాన్ని విడుదల చేసింది.

కరోనా నేపధ్యంలో... ప్రభుత్వం దూరదర్శన్‌లో ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కాగా... సోమవారం(ఈ నెల 13) నుంచి 31 వ తేదీ వరకు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో... వారంలో ఐదు రోజులు, రోజుకు ఆరు గంటల చొప్పున తరగతులు ప్రసారమవుతాయి.

ఒకటి, రెండు తరగతులకు... మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు, 6, 7 తరగతులకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి, 3 గంటల వరకు, 8, 9 తరగతులకు... మధ్యాహ్నం 3 గంటల నుంచి, 4 గంటల వరకు, పదవ తరగతికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.