శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (10:04 IST)

రేపటి నుంచి దూరదర్శన్ లో రామాయణం పునః ప్రసారం

రేపటి నుంచి దూరదర్శన్ లో రామాయణం పునః ప్రసారం. ఉదయం, సాయంత్రం రెండుసార్లు ప్రసారం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు.

దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. దాంతో టీవీల వీక్షణ అధికమైంది. అప్పట్లో రామాయణం సీరియల్ కు విశేష ఆదరణ లభించింది. ఇప్పటికీ ఆ సీరియల్ పట్ల ప్రజల్లో ఆదరణ వుంది.

దీనికి తోడు రోబోల పాత్రలతో విసిగి వేసారివున్న జనం పౌరాణిక సీరియల్ ను మరింతగా ఆదరిస్తారని దూరదర్శన్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే వరుస ప్రకటనలతో బోర్ కొట్టించకుండా సీరియల్ ప్రసారం చేయనున్నట్లు తెలిసింది.
 
ఇదిలా వుండగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ ఎంటీఎన్ఎల్ ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం చేస్తున్న వారికి నెల రోజులపాటు ఉచిత డేటా అందిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. 

చాలా సంస్థలు ఎంటీఎన్ఎల్ ఎంపీఎల్ఎస్ నెట్‌వర్క్‌లో తమ ప్రధాన సర్వర్‌ను కలిగి ఉన్నాయని సునీల్ కుమార్ తెలిపారు. ఎంటీఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు కలిగిన ఆయా సంస్థల ఉద్యోగులు ఎంటీఎన్ఎల్ వీపీఎన్ఓబీబీ (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ ఓవర్ బ్రాడ్‌బ్యాండ్)తో ఎనేబుల్ కావొచ్చని, తద్వారా వారు తమ కార్యాలయ సర్వర్లను యాక్సెస్ చేసుకోవచ్చని, ఇది చాలా సురక్షిత మాధ్యమమని సురేశ్ కుమార్ పేర్కొన్నారు.

కార్యాలయంలో ఉద్యోగులకు ఆయా సంస్థలు కల్పించే అన్ని ఆఫర్లు ఈ సర్వీస్ ద్వారా పొందవచ్చని తెలిపారు. ఆఫీసులో చేసే అన్ని పనులను ఇంటి పట్టున ఉండి చేసుకునే సౌలభ్యం లభిస్తుందన్నారు. ఈ విషయంలో యాక్సెస్ లిమిటేషన్స్ ఏమీ ఉండవని స్పష్టం చేశారు. ఇందుకోసం అదనంగా ఎటువంటి చార్జీలు వసూలు చేయబోమన్నారు.