సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2024 (13:19 IST)

రూ. 160 కోట్లతో డ్రీమ్ ప్రాజెక్ట్.. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభం

amaravathi
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శనివారం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించారు. రాజధాని ప్రాంతంలోని రాయపూడి గ్రామంలో గత ఐదేళ్ల విరామం తర్వాత 'డ్రీమ్ ప్రాజెక్ట్'ను ప్రారంభించారు. 
 
2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూటమి సర్కారు కొలువు దీరడంతో అమరావతి రాజధాని ప్రాజెక్టుకు పెద్దపీట వేసింది. అక్టోబర్ 16న జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో పనులు పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు శనివారం అధికారిక ప్రకటనలో తెలిపారు. అమరావతిని సంపద సృష్టికి కేంద్రంగా మార్చే వారికే భూముల కేటాయింపులు జరపాలని నిర్ణయించారు. 
 
టాప్ 10 కాలేజీలు, స్కూల్స్, ఆసుపత్రులు ఏర్పాటయ్యేలా ప్రణాళికలు రచించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ. 160 కోట్లతో ఏడు అంతస్తుల్లో కార్యాలయ పనులను సీఆర్డీఏ చేపట్టింది. ఆ పనులను గత వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది.