నారా లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. డ్రోన్ విద్యుత్ వైర్లకు తగిలి..?
టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ డ్రోన్ కెమెరా విద్యుత్ వైర్లకు తగిలి లోకేష్ ముందు పడిపోయింది. లోకేష్ బస్సు దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆపరేటింగ్ లోపం కారణంగానే డ్రోన్ కిందపడినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మంగళగిరిలో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బస్సు నుంచి లోకేష్ కిందకు దిగిన సమయంలో డ్రోన్ ఆయన ముందు పడిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఒక్క అడుగు ముందుకు పడినా ఆ డ్రోన్ ఆయన మీద పడేది. ఆపరేటింగ్ లోపం కారణంగా ఆ డ్రోన్ విద్యుత్ వైర్లకు తగిలి కింద పడిపోయిందని భద్రతా సిబ్బంది తెలిపారు.