శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (12:26 IST)

పేపర్లో దొరుకుతున్న ఇసుక బయట ప్రజలకు దొరకడం లేదు జగన్ గారు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఇసుక రీచ్‌లపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. " ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం అంటూ భారీగా ప్రకటనలు ఇస్తున్నారు. 
 
మీరు చెప్పిన టోల్ నెంబర్ నిజంగా పనిచేస్తే మీ పార్టీ ఇసుకాసురుల కోసం పక్క రాష్ట్రం జైళ్లు కూడా అద్దెకు తీసుకోవాలి". మీ నూతన ఇసుక పాలసీ వలన 50 మంది కార్మికులు బలైయ్యారు. నిర్మాణ రంగం పడకేసి 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు.

ఇసుక రేటుని మీ నాయకులు పెంచుకుంటూ పోతున్నారు. మీ పత్రికలో ప్రకటనలకు కోసం వృధా అవుతున్న ప్రజా ధనంతో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటే సంతోషిస్తాం అంటూ నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.