మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (15:30 IST)

శశికళ తీర్పుతో జగన్ లోటస్ పాండ్‌లో భూకంపం వచ్చింది... బోండా

అక్రమాస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో భూకంపం వచ్చిందంటూ తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ... 66 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శి

అక్రమాస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో భూకంపం వచ్చిందంటూ తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ... 66 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిందనీ, పదేళ్లపాటు రాజకీయ జీవితం లేకుండా అయిందన్నారు. 
 
ఈ నేపధ్యంలో 42వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి శిక్ష పడుతుందో ఊహించవచ్చన్నారు. జగన్ మోహన్ రెడ్డికి కనీసం 40 సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి కోర్టు తీర్పులను చూసి ఆందోళనలో పడిపోతున్నారని వ్యాఖ్యానించారు.