శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (14:50 IST)

సరిహద్దుల్లో చేసే యుద్ధం కంటే.. ఏపీలో భూమిని కాపాడుకునేందుకు చేస్తున్న యుద్ధమే కష్టంగా ఉంది!

ప్రభుత్వం కేటాయించిన భూమిని కాపాడుకునేందుకు ఓ మాజీ సైనికుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ అధికారులతో నిత్యం యుద్ధం చేస్తున్నాడు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో శత్రుసైన్యంతో చేసే యుద్ధం కంటే... సొంతూరులో

ప్రభుత్వం కేటాయించిన భూమిని కాపాడుకునేందుకు ఓ మాజీ సైనికుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ అధికారులతో నిత్యం యుద్ధం చేస్తున్నాడు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో శత్రుసైన్యంతో చేసే యుద్ధం కంటే... సొంతూరులో ప్రభుత్వం కేటాయించిన భూమిని కబ్జాదారుల నుంచి కాపాడుకునేందుకు చేస్తున్న యుద్ధమే కష్టంగా ఉందని వాపోతున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంకు చెందిన మేడికొండ ఆదాం అనే వ్యక్తి 1961–62 నుంచి 1975 వరకు ఇండియన్ ఆర్మీలో పని చేశాడు. ఆయన 1962లో చైనాతో, 1965, 1971 పాకిస్థాన్‌‌తో జరిగిన యుద్ధాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. 15 యేళ్ళ  సర్వీసు ముగిసిన తర్వాత స్వచ్చంద విరమణ తీసుకున్నారు. 
 
ఈ సమయంలో సాగుచేసుకునేందుకు భూమి కావాలని అర్జీ పెట్టుకోవడంతో ప్రభుత్వం పట్టించుకోలేదు. 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డిని కలిసి జీవనోపాధికి భూమి కేటాయించాలని కోరడంతో ఆయన ఆదేశాలమేరకు అధికారులు వెల్లటూరు పరిసరాల్లో 4.50 ఎకరాలు సర్వే చేసి హద్దులు చూపారు. అయితే, ఈ భూమిని సాగుచేయడం లేదన్న కారణంతో భూమి రికార్డులను మార్చి ఆక్రమించుకునేందుకు కొందరు పావులు కదుపుతున్నారు.
 
ఈ భూములను కాపాడుకునేందుకు ఆయన నాలుగున్నరేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండడంతో లేదని ఆయన చెప్పారు. సరిహద్దుల్లో పోరాటం కంటే ఈ భూమిని కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటం చాలా కష్టంగా ఉందని ఆయన వాపోయారు.