శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 2 జనవరి 2017 (17:21 IST)

కిడ్నీ బాధితుల బాధ ఎలాంటిదో చూడండి.. జనసేన డాక్యుమెంటరీ.. పవన్ ప్రకటన (Video)

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకాకుళంలోని ఉద్దానంలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పవన్ కల్యాణే స్వయంగా ప్రకటించారు. ఉత్తర కోనసీమగా పిలుచుకునే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకాకుళంలోని ఉద్దానంలో పర్యటించనున్నారు. ఈ  విషయాన్ని ట్విట్టర్ ద్వారా పవన్ కల్యాణే స్వయంగా ప్రకటించారు. ఉత్తర కోనసీమగా పిలుచుకునే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సంబంధ వ్యాధులతో గత ఇరవై ఏళ్లలో 20వేల మందికి పైగా మృత్యువాతపడ్డారని తెలిపారు. వారిని పరామర్శించేందుకు పవన్ వెళ్తున్నట్లు జనసేన తెలిపింది. 
 
కిడ్నీ వ్యాధులతో ప్రస్తుతం లక్షలాది మంది బాధపడుతున్నారని.. వీరి సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ విలేకరుల బృందం అక్కడి వెళ్లి వారి సమస్యలపై డాక్యుమెంటరీ తయారు చేసిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. జనసేన రూపొందించిన ఈ వీడియోను చూసి వారి బాధ, సమస్య తీవ్రత ఎలా ఉందో తెలుసుకోవాలని పవన్‌ ట్వీట్‌ చేశారు. కాగా పవన్‌ సోమవారం రాత్రికి విశాఖకు చేరుకొని మంగళవారం ఉద్దానం వెళ్లి నిస్సహాయులుగా ఉన్న బాధితులతో మాట్లాడనున్నారు.
 
ఇక పవన్ శ్రీకాకుళం పర్యటనను పురస్కరించుకుని జనసేన అన్నీ ఏర్పాట్లు చేసింది. పవన్ ప‌ర్య‌ట‌న కోసం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ అభిమానులు ముమ్మ‌రంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం మొదట జిల్లాలోని ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్‌ ప్రాంగణంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను ప‌రామ‌ర్శించి వారి బాధ‌ల గురించి తెలుసుకుంటారు. ఆయ‌న‌ కలుసుకోబోయే రోగుల జాబితాను జన‌సేన నేత‌లు సిద్ధం చేశారు. త‌రువాత అక్క‌డ నిర్వ‌హించ‌నున్న రోడ్ షో లోనూ పవన్ క‌ల్యాణ్ పాల్గొనే అవకాశాలున్నట్లు జ‌న‌సేన శ్రేణుల ద్వారా తెలిసింది.