మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 24 అక్టోబరు 2018 (10:03 IST)

ప్రియురాలు డబ్బులు అడుగుతోందనీ... దట్టమైన చెట్ల మధ్యకు తీసుకెళ్లి...

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తనను పదేపదే డబ్బులు అడుగుతూ బెదిరిస్తుండటంతో ఆమెను ప్రియుడు హత్య చేశాడు. ఆ మహిళను నమ్మించి ఊరుబయట వున్న దట్టమైన చెట్ల పొద్దల్లోకి తీసుకెళ్లి తలపై పెద్ద బండరాయితో కొట్టి ఆపై మెడకు ఉరిబిగించి చంపేశాడు. 
 
హైదరాబాద్ నగరంలోని శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, ఉప్పుగూడ భయ్యాలాల్‌ నగర్‌కు చెందిన నేనావత్‌ ఈశ్వర్‌ అనే వ్యక్తికి వి.రంగి (40) అనే మహిళ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. పైగా, ఈశ్వర్‌కు పెళ్లి అయినప్పటికీ ఆ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఈశ్వర్‌ను రంగి పదేపదే డబ్బులు అడుగుతూ వచ్చింది. పైగా, డబ్బులివ్వకుంటే పోలీసులకు అప్పగిస్తానని బెదిరిస్తూ వచ్చింది. 
 
ఆమె బెదిరింపులను తట్టుకోలేని ఈశ్వర్... ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 15న లాల్‌దర్వాజ లేబర్‌ అడ్డాలో ఉన్న ఆమెను ఇంట్లో పని ఉందని చెప్పి ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని రావిరాల ప్రాంతంలో దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాడు. తలపై బలంగా మోది తను తీసుకెళ్లిన తాడుతో ఉరివేశాడు. విచారణలో ఆమెను తానే హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు.