గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (15:02 IST)

తూర్పుగోదావరి జిల్లాలో గోవా విస్కీ బాటిల్స్ స్వాధీనం

తూర్పుగోదావరి జిల్లాలో పది లక్షల విలువైన గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రావులపాలెం పోలీసులు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ బృందం కలిసి రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో హైవేకి దగ్గరలో ఉన్న నాయుడు లేఔట్‌లో ఉన్న గోడౌన్ నందు దాడులు నిర్వహించారు.
 
గోడౌన్‌లో నిల్వ ఉంచిన గోవాకు చెందిన 9,200 క్వార్టర్ విస్కీ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి మద్యాన్ని తెప్పించి నిల్వ చేసిన ప్రధాన ముద్దాయి కూసుమంచి వెంకట రత్న త్రినాథ్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.