బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (15:37 IST)

'బిగ్ బాస్' ఫేం సరయుపై కేసు నమోదు

బోల్డ్ కామెంట్స్‌తో నానా హంగామా చేసి బిగ్ బాస్ ఫేం సరయుపై పోలీసులు కేసు నమోదు మోదు చేశారు. ఓ హోటల్‌ ప్రచార పాటలో హిందువుల మనోభావాలను దెబ్బతినేలా ఆమె నడుచుకున్నారని పేర్కొంటూ ఈ కేసు నమోదు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అశోక్ సిరిసిల్ల పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. హోటల్ ప్రమోషన పాటలో సరయుతో పాటు.. మరికొంతమంది సింగర్లు, గణపతి బప్పా మోరియా బ్యాండ్‌లను తలకు ధరించి మద్యం సేవించారని పేర్కొన్నారు. 
 
దేవుడి బొమ్మలు ధరించి మద్యం సేవించి హోటల్స్‌ దర్శిస్తారనే సంకేతాన్ని పంపుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి చర్యలను హిందూ సమాజం ఏమాత్రం సహించజాలదని పేర్కొన్నారు. అందువల్ల సరయుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన కోరారు. దీంతో సిరిసిల్ల పోలీసులు సరయుపై కేసు నమోదు చేశారు.